ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ కి నా తేటగీతి అనువాదం
మినుకు మినకను చిఱు తార
మింటిన నిను కనుగొని యెపుడు
ఎవ్వరీ ఘన మణిమయమై
వెలుగుల గనియని మైమరపు
మినుకు మినుకను చిఱు తార..
మినుకు మినుకు తార..
తే.గీ. మినుగు మినగను చిఱుతార మింటిన నిను
కనుగొని యెపుడు ఎవ్వరీ ఘన మణిమయ
మై వెలుగుల గనియని మైమరపు మినుగు
మినుగను చిఱుతార మినుగు మినుగు తార
Subscribe to:
Post Comments (Atom)
6 comments:
:-)
:)
గిరి గారు,
బాగా కుదిరింది అనువాదం. కొంచం అనుమానం వచ్చి బ్రౌణ్యం చూసా. మినుగు బదులు మినుకు వాడండి.
అనువాదాలు కష్టమే, అందునా పద్య రూపంలో..You could do better!
గిరిగారు,
మీ ప్రయత్నం మంచిదే. దానికి అభినందనలు. మొహమాటం లేకుండా చెప్పాలంటే, ఇది నాకు పెద్దగా నచ్చలేదు. నాకు తోచిన రెండు సూచనలు:
1. ఎంచుకొనే ఛందస్సు సరైనది అయ్యి ఉండాలి. "ట్వింకిల్ ట్వింకిల్ లిట్టిల్ స్టార్" కూడా ఛందస్సులో ఉన్న పద్యమే. అది మాత్రా ఛందస్సు. ప్రతి పాదానికీ 4, 4, 4, 2 మాత్రలు వస్తాయి. ఇదే ఛందస్సైతే బావుంటుంది. లేదూ మన తెలుగువాళ్ళకి పరిచయమైన ఛందస్సే వాడాలని అనుకుంటే, దానికి కొంత దగ్గరగా ఉండే, ముత్యాలసరం (మొదటి మూడుపాదాలూ 3, 4, 3, 4 మాత్రలూ, చివరి పాదం 3, 4, 3, 2 మాత్రలూ) బావుంటుంది. ఇంగ్లీషు రైములో (పద్య నిర్మాణ పరంగా) మరికొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి.
2. వాడే భాష - ఇది పిల్లల పద్యం కాబట్టి సాధ్యమైనంతవరకూ పదాలూ, వాక్యాలూ కూడా వాడుకభాషకి దగ్గరగా ఉంటే బావుంటుంది.
మీకు ఉత్సాహం ఉంది కాబట్టి, ఈ రెండు విషయాలూ దృష్టిలో పెట్టుకొని మరో ప్రయత్నం చెయ్యకూడదూ?
వికటకవి గారు,
టిప్పాఫ్ ద ఐస్ బర్గ్ ని సవరించాను.
కామేశ్వర రావు గారు,
ఇది వ్రాసిన తరువాత నాలో ఉన్న అసంతృప్తి తెరెసా గారి వ్యాఖ్య చదివాక పెరిగింది. మీ వ్యాఖ్య అది తగ్గించుకునే దారి చూపించింది.
సరైన ఛందస్సు ఎంచుకోవాలని మీరు చెప్పినది చాల నిజం. మాత్రాఛందస్సులో మరోసారి తప్పక ప్రయత్నిస్తాను.
ఆంగ్లలో ఇదివరకు నేను కొన్ని లిమరిక్కులు వెలగబెట్టానులెండి, అవికాక సోనెట్లు - ఇవి తప్ప నాకు ఆంగ్ల మీటర్లలో పెద్దగా ప్రవేశం లేదు.
Post a Comment