రానారె కడప కేంద్రం నుంచి వెలువరించిన సమస్యకి నా పూరణ ఇదిగో - రావణుడికి హనుమంతుని హితబోధ ఇది.
శా. కామాగ్నుల్ హరియించి పోవు తృటిలో, కైంకర్య మందేనురా,
రా, మాయమ్మను భక్తితత్పరుడవై రామయ్యకందించగా
రా, మా రామ పదాబ్జముల్ కొలువరారా, కీర్తి మిన్నందురా
నీ మాన్యంబిక లోకమందు వెలుగున్ దేదీప్యమానంబుగా
Saturday, April 19, 2008
Subscribe to:
Post Comments (Atom)
6 comments:
గిరిగారూ, బ్రహ్మాండం! ఆంజనేయుడు గొప్ప అథారిటీతో చెబుతున్నట్టున్నాడు. "రా, మా రామ పదాబ్జముల్" అంటూ మీరు విరిచిన తీరు చాలా బాగుంది. కైంకర్యము అంటే కింకరుడు చేసే పని. రావణాసురుడు పూర్వజన్మలో విష్ణువుకు ద్వారపాలకుడంటారు (అంటారా!?) ... ఆ లెక్కన చూస్తే ఈ పద్యం చాలా గొప్పది. మార్కులు 11/10 వేయవచ్చు.
గిరి గారు అద్భుతము చాలా బాగుంది పద్యము శార్దూలము ఇంత తేలిక పదలతో చాలా బాగా వ్రాశారు....
మీర్రాసిన పద్యాల్లోని మణిపూసల్లో ఒకటిది. చాలా బావుంది.
Agree with Chaduvari garu. Well done!
రామనాథా, రావణుడు కుంభకర్ణుడు వీరిరువురూ జయవిజయుల అవతారాలంటారు నిజమే - కానీ నేనా ఊహతో వ్రాయలేదు, మీరు కొంచెం గొప్పదనాన్ని ఆపాదించేసారు, అంతే :) - ఇలానే సమస్యలిస్తూ ఉండండి. మా బోటి వాళ్ళకి కొంత అభ్యాసమిది..
బ్లాగేశ్వరా, చదువరీ, శ్రీరామా, ధన్యవాదాలు
మీరు మరీనండి, మరీ ఇంత అణకువా? :)
Post a Comment