ఈ వారం పని మర్చిపోయి, సరదా ఎంజాయిమెంట్లో పడే
పోవాలంటు, మరేమి బాధ్యతల బర్వూ లేని స్వేఛ్ఛాయువే
కావాలంటు, యధేఛ్చగా తిరుగుతూ కాలం వృధా చేస్కునే
ఆవారా పనిలో పడాలనుకునే, అయ్యాను సిధ్ధం! పొలో!!
వచ్చే వారమంతా నేను హైదరాబాదులోనే ఉంటాను. ఈ మధ్య పెరిగిన పని వత్తిడి నుంచి కొంత విముక్తి కూడా - వీలు దొరికినప్పుడు విశాలాంధ్రాకి వెళ్ళి మంచి పుస్తకాలు కొన్ని కొనుక్కోవాలని అనుకుంటున్నాను, అంతకు మించి ఇంకేమీ పనులు పెట్టుకో దలచు కోలేదు. ఎవరైనా బ్లాగ్మిత్రులు ఈ సమయంలో సమావేశాలేవైనా పెట్టుకోవాలనుకుంటుంటే తెలియజేయమని మనవి. రావడానికి తప్పక ప్రయత్నిస్తాను.
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
సమావేశం పెట్టుకున్నాం. రండి మరి.
మీరు పూనుకోవాలేగానీ పద్యరూపకాలనే రాసేయగలరు.
Post a Comment