Tuesday, March 18, 2008

ఆడువారి చేతలకు అర్ధలె వేరులే

ఓ మద్దుగుమ్మకి ఇద్దరు దగ్గర స్నేహితులు. వారి స్నేహాలు ప్రేమగా మారడానికి పెద్ద సమయం పట్టలేదు. అమ్మాయికి ఇద్దరూ ఇష్టమే, మరెలా? ఇక అటో ఇటో తేల్చుకోవాలనుకుంటుండగా అబ్బాయిలిద్దరూ దగ్గరవ్వమని కోరారు.

మొదటబ్బాయి:
My dear you will never get a nicer

buddy than me, you’re lucky
don’t run away likeyou don’t likeme, silly
you can never getaway, come to me

అన్నాడు. అతనన్నది నిజమని అమ్మాయికి తెలుసు. ఐనే ఎదో అనుమానం. ఇంతలో

రెండవబ్బాయి:

O! very very nice lovely pretty young

thing, I do not think it is fair
for you to give me a bored look, hear
will be ya’ love, please come near.

అన్నాడు.

అమ్మాయి ఓ క్షణమే ఆలోచించింది. వెంటనే రెండవబ్బాయి దగ్గరకి చేరింది.

ఎందుకు?


==

ఎందుకంటే చిన్నప్పుడు మనము చదువుకున్న కాళిదాసు, భవభూతి (కల్పిత) కధలో ఎక్కువ అణాలిచ్చిన కవికే తాంబూల మిచ్చిన అమ్మాయిలాగ, ఈ అమ్మాయి కూడా, పైన చెప్పిన పలుకులని ఇలా విన్నది.

మొదటబ్బాయి:

My dear you will never get a nicer buddy than me, you’re lucky don’t run away likeyou don’t likeme, silly you can never getaway, come to me

ఆ.వె. మైడియరు, యువిలు నెవరు గెటె నైసరు
బడ్డి దాను మీ, యువారు లక్కి,
డోన్టు రనవె లైక్యు డోన్టులైక్మీ, సిల్లి,
యూకెను నెవరు గెటెవే, కముటుమి

రెండవబ్బాయి:

O! very very nice lovely pretty young thing, I do not think it is fair for you to give me a bored look, hear will be ya’ love, please come near.

కొ.వె. ఓ వెరివెరి నైసు లవులీ ప్రెట్టి యంగు
థింగు, ఐడునాటు థింకిటీజు ఫెయిరు
ఫరుయు టు గివు మీ ఎ బోర్డు లుక్కు, హియరు,
విల్లు బీ య’ లవ్వు, ప్లీజు కమ్ము నియరు

విని, నన్ను కోరుతూ ఆటవెలదా? అనుకుని కొత్తవెలది పలికిన అబ్బాయి దగ్గరకే చేరిందన్నమాట..

(కొత్తవెలది అని పేరు కనిపెట్టిన రాకేశ్వరా, చప్పట్లు!)

6 comments:

Unknown said...

సింపుల్! మొదటివాడు తనను తానే పొగుడుకున్నాడు. రెండోవాడు ముద్దుగుమ్మను పొగిడాడు. అంతేనా గిరిగారూ?

గిరి Giri said...

సుగాత్రి గారు, మీరు కెవ్వ్ మనే విధంగా ఓ వివరణ నిచ్చాను చూడండి :)

Anonymous said...

గిరిగారూ, మీకు జోహార్లు. ఇంగ్లీషులో తెలుగు పద్యాలు రాయడం చాలా గొప్ప ప్రయోగం. ఇదివరకు ఎవరైనా ఇలా రాశారా?

కొత్తవెలది అదిరింది. ఇంత చిక్కుముడులిస్తే ఎవరైనా పారిపోతారు. అయినా ఆ అమ్మాయి అర్ధం చేసుకుని కొత్తవెలదిని వరించిందంటే నిజంగా గొప్ప వెలదే!!!

(వెలది అంటే స్త్రీ అనే కదా అర్ధం?? ఇంకేమైనా అర్ధముంటే ముందే క్షమాపణలు.)

రాఘవ said...

నాగమురళి గారూ,
http://jyothivalaboju.blogspot.com/2008/01/blog-post_179.html
చూడండైతే.

ఐనా రాకేశుడిలా క్రొత్త వెలదులపై పడ్డాడని నక్షత్రాలకి గానీ తెల్సిందో... యిక చూస్కోండి కేక, పండగే పండగ :D

rākeśvara said...

@ గిరి గారు,
మీరు నిజంగా నిజంగా నిజంగా అసాధ్యులు.
నేననుకోవడం ఈ చిక్కు ముడి మీకూ నాకూ తప్ప ఇంకెవరికీ అర్థంకాదేమో.. నాకు కూడా మీరు ఇచ్చిన వివరణ చూసే అర్థమయ్యింది, అది చూసి కూడా చాలా మందికి అర్థంకాదేమో.
కొత్తపాళీ, రానారె, రాఘవ వంటి వారికి కూడా కష్టమే!

చిక్కును అర్థంచేసుకోవడానికి ఇంకో చిన్న హింటు ఇక్కడ .

@ రాఘవ ,
నక్షత్రాలంటే ఎవరో నాకు అర్థంకాలేదు...

రానారె said...

నాకు అర్థం కాలేదు. ;-)

గిరీ, చమక్కు అదరహో!:) ఆంగ్లంలో ఛందం కుదిర్చి మీరు వొకమెట్టుపైకెళ్లారు. కుదిరితే చందస్సును సరిచూసే కంప్యూటరు ప్రోగ్రామును కూడా తయారు చెయ్యండి. :)