Monday, March 10, 2008

పొద్దు మిత్రమా

ఇది చదవండి. ఇక,

చ. వడివడిగా పదాలపొది వాడి శరమ్ములవంటి పద్యముల్
విడువగ, కొన్ని తప్పినవి వేగిరపాటుకు దారి, చేరకే
పడినవి మార్గమధ్యమున, మంచివి కావని యట్టిపధ్ధతుల్,
విడుమని చెప్పినావు, విరమించెద వేగిరపాటు, (పొద్దు)మిత్రమా

3 comments:

Kolluri Soma Sankar said...

మీ ఈ పద్యం చాలా సులువుగా అర్థమయ్యేలా ఉంది. సాధారణంగా ఛందస్సు, గణాలు, యతి, ప్రాస.... లాంటివి పద్యాల పట్ల జనాలకి కొంత అనవసరమైన భయాన్ని కల్గిస్తాయి. ఇలా పద్యాలు వాడుక భాష లోను ఛందోబద్ధంగా రాయగలిగితే వాటిని ఆస్వాదించ వచ్చు
సోమ శంకర్

Anonymous said...

ఈ పద్యం నేను "miss" అయ్యాను, బావుంది, గమ్య మధ్యం కంటే మార్గమధ్యం అంటె బావుండేదేమో - మరి పొద్దు వారు 'పద్య reply' ఇవ్వలా?
- ఊక దంపుడు

గిరి Giri said...

ఊకదంపుడుగారు, మార్గమధ్యము అని సవరించాను - చెప్పినందుకు మీకు నా నెనరులు..