ఈ మధ్య పాత పాటలు వినడం పెరిగింది. దానితోపాటే ఆకాలం నాటి గొప్ప సంగీత దర్శకులు, పాటలు/పద్యాల రచయితలపై కూడా మక్కువ పెరిగింది. పింగళి, పెండ్యాల, సముద్రాల (రాఘవాచార్య), ఆత్రేయ, ఆరుద్ర, మహదేవన్, దేవులపల్లి, కోదండపాణి, రాజేశ్వర రావు వంటి వారి గురించి కుతూహలము పెరిగింది.
ఘంటసాల గారి గురించి వెతుకుతూ ఈ గొప్ప సైట్ ని కనుగున్నాను. ఎన్నో గొప్ప పాటలు, పద్యాలు ఉన్నాయక్కడ - అదే కాక కొన్ని పాటలకి ముందు ఘంటసాల గారితో పనిచేసిన వారి మాటలు ఉన్నాయి. వీలు దొరికితే మీరూ విసిటేయండి.
అడగదలచిన విషయమేమంటే, "చూపులు కలిసిన శుభవేళా.." పాటలో పింగళి గారు "చెలువములన్ని చిత్రరచనలే, చలనములోహో నాట్యములే" అని రాయగా, ఘంటసాల గొప్పగా పాడగా, నాగేశ్వర రావు గారు తెర మీద ఎంతో గొప్పగా పెదవులు క(ది)లిపారు కదా? అదిమనమందరమూ ఎప్పుడో ఒకప్పుడు వినడమో, చూడడమో జరిగిందే కదా?
పై రెండు ప్రశ్నలకీ మీరు ఒప్పుకుంటూ తలూపిఉంటే, మరి చెలువము అంటే ఏంటో చెప్పగలరా? నాకైతే (సందర్భాన్నిబట్టి) 'భంగిమ ' అని అనిపిస్తోంది. మీరేమంటారు?

5 comments:
చెలువము అంటే అందం అని అర్థం
అందమే అనుకుంటున్నా..
"చెలువమునేలగ చెంగటలేవని కలతకు నెలవై నిలిచిన నెలతకు" అని పాట ఉంది కదా.
అన్నట్టు ఇన్నాళ్ళూ అది అన్నమయ్య కీర్తనేమో అనుకున్నా. కానీ సిరివెన్నెల వారిదట.
స్వాతి గారూ, మీరు ఆ పాటను (శృతిలయలు లోనిది) అన్నమయ్య కీర్తన అని అనుకున్నట్టే ఆ ఏడు నంది అవార్డుల పోటీకి ఈ పాటని ప్రతిపాదించినప్పుడు ఒక న్యాయ నిర్ణేత కూడా ఇలాగే అనుకుని ఆ పాటని పక్కకు పెట్టేసారంట! ఆ తర్వాత విషయం తెలిసి నాలిక్కరుచుకుని శాస్త్రిగారికే ఉత్తమ గీత రచయిత పురస్కారం ఇచ్చారు.
శ్రీ, స్వాతి,
పదానికి అర్ధం చెప్పినందుకు ధన్యవాదాలు.
శ్రీ,
నేనూ సిరివెన్నెల గారి అభిమానినే. మీరు చూసే ఉండవచ్చు, సిరిన్వెన్నెల గారి వెబ్ సైట్ ఉంది..ఇక్కడ
మీ ఈ టపా వల్ల నా సందేహం కూడా తీరిపోయింది.థాంక్స్.సిరివెన్నెల గారికి నేను పెద్ద అభిమానిని.
Post a Comment