Sunday, August 24, 2008

వీరెవరు?

నచ్చిన బ్లాగుల గురించి వ్రాస్తున్నప్పుడు తట్టిన ఆలోచన ఇది. ఓ బ్లాగు గురించో, ఆ బ్లాగులోని ప్రసిధ్థి పొందిన టపా గురించో లేక సదరు బ్లాగరు గురించో ఒకటో రెండో ముక్కలు తెలియజేస్తే - అది ఎవరో పట్టేయగలడం సాధ్యమేనా అని. నేను చెప్పే ముక్కలు నా అనుకోలు కాబట్టి కష్టమవ్వ వచ్చు, కానీ నవ్వులాటకి ఓ పృఛ్ఛకంలా ఆడుకుంటే కాసింత నవ్వు వచ్చు కదా అని, నా ఆలోచనని టపా చేసేసాను. ఇది ఎవరినీ నొప్పించడానికి చేసిన ప్రయత్నం కాదని గమనించి, నేను వ్రాసిన లైన్లు అక్షరాలా నిజం కాకపోవచ్చునని గ్రహించి, వీలు దొరికితే కాస్త బుఱ్ఱగోకి, ప్రయత్నించండి..

బ్లాగులెవరివో చెప్పను, బ్లాగు గురుతు
నొక్క ముక్క వాడుతు వెలిగక్కుతాను,
చూసి చెప్పగలరొ లేరొ చూతు మింక,
నవ్వులాట కాన యెవరు నొవ్వరాదు.

1. తానొవ్వక నొప్పించక (చురకలంటిస్తున్నప్పుడు కూడా :-) OR హుందాతనము
2. బ్లాగక్క
3. పాండిత్యం
4. కేనన్ తో ఫొటోలు
5. "రాక్స్" (రాళ్ళు కావు)
6. పది రూపాయల నోటు
7. సినిమా
8. తెలుగువీరుడు
9. రాముడు మంచి బాలుడు
10. ఆంగ్లము, హాస్యము
11. అనువాద కథలు
12. సాంకేతిక విషయాలు
13. కడప
14. వికిపీడియా
15. కింగ ఫిషర్ విమాన భామలు
16. పనిలేని మంగలి :-)

11 comments:

netizen నెటిజన్ said...

దీనికి వ్యాఖానాలు ఎలా ఉంటయ్యోనని బుర్ర గోక్కుంటూ..

జ్యోతి said...

2. నేనేనా??
5. రాకేశ్వర (అందం)
7. నవతరంగం
8. రవి వైజాసత్య
9. ఇంకెవరు రానారే గాక
12. వీవెన్, ప్రవీణ్, శ్రీధర్ ????
13. 3విక్రమ్
15. వికటకవి

మళ్ళీ బుర్ర గోక్కుని వచ్చి మిగతావి చెప్తాను.

Unknown said...

భలే ఉంది లే. చూద్దం అన్ని కామెంట్లూ

Unknown said...

15 మాత్రం తోటరాముడైయుండవచ్చు

కొత్త పాళీ said...

3. భై కా రావుగారు
4. చేతన
5. సౌమ్య
10. ఊకదంపుడు
11. కొల్లూరి సోమశంకర్
15. రెండు రెళ్ళ ఆరు తోటరాముడు
16. ఇది చూసినప్పుడు కూడా నాకు ఊక్దంపుడే గుర్తొచ్చారు.

teresa said...

1. kottapaALi.
2.Jyothi.
3.Tadepalli.
4.Chetana.
5. Don't know..
6.raakeswara.
7.navatarangam.
8.Bhyravabhatla.
9. sreeram.
10.vookadampudu.
11.kolloori.
12.nallamothu.
13.raanaare.
14.Vyjasatya.
15.thoTaraamuDu.
16. Don't know..

మాలతి said...

చెప్పుకోలేను గానీ బ్లాగరుగారిని మెచ్చుకోకుండా వుండలేను :)

కామేశ్వరరావు said...

బావుంది ఐడియా (ఎవరి జీవితాలనీ మార్చదనుకోండి :-)
ఇప్పుడు మీరిచ్చిన యీ ప్రహేళికని చూస్తే గుర్తుకొచ్చింది. కొన్నాళ్ళక్రితం, యీ బ్లాగ్లోకంలో Treasure Huntలా "బ్లాగుహంటు" ఒకటి నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. ఆసక్తి ఉన్న బ్లాగోత్సాహులెవరైనా ప్రయత్నించవచ్చు.

జ్యోతి said...

ఉఫ్...

వికటకవి చెప్పింది ఎయిర్ ఇండియా భామల గురించి కదా?

రానారె said...

భలే ఐడియా గిరిగారూ! ఎవరి జీవితాలనూ మార్చదనుకోండి అన్న మాట వినగానే ఫక్కున నవ్వొచ్చింది. భైరవభట్లగారికి నెనరులు.

Unknown said...

16 ఎవరండీ? బాగుందండీ మీ ప్రయత్నం.