అనగనగా ఒక రాజు, ఆ రాజుకి ఏడుగురు కొడుకులు, ఆ ఏడుగురు కొడుకులు ఒక రోజు వేటకి వెళ్ళారు...
ఈ కధ మనమందరము చిన్నప్పుడే విన్నాం. "చేపా చేపా ఎందుకు ఎండలేదు?" అన్న డొంక కదిలించగల తీగ లాంటి ఈ ప్రశ్నతో ఆ కధ ముందుకు చర-చరా పాకేస్తుంది. (మరో విషయం, ఇదే ప్రశ్నకి బాపు-రమణ గార్ల తెలివైన సమధామూ ఉంది. "చేపా చేపా ఎందుకు ఎండలేదు?" అంటే చేప "ఎండలేదు" అందిట)
ఇంతకీ చెప్పొచ్చిన విషయమేమిటంటే, ఇలాంటివి చిన్ననాటి కధల్లోనే కాదు నిజజీవితంలో కూడా జరుగుతాయి, తెలుసా?
==
ప్ర: అయ్యగారు, అయ్యగారు మీకు 230 డాలర్లు ఎందుకు?
జ: నా కోళ్ళు చచ్చిపోయాయి కాబట్టి.
ప్ర: కోళ్ళు, కోళ్ళూ మీరంతా ఎందుకు చచ్చిపోయారు?
జ: పిల్లాడు అరిచాడు కాబట్టి (అరిస్తేనే చచ్చిపోవాలా అని ఇంకొక పంధాలో వెళ్ళిపోవచ్చును కానీ...)
ప్ర: అబ్బాయి, అబ్బాయి ఎందుకు అరిచావు?
జ: కుక్క మొరిగింది కాబట్టి
ప్ర: కుక్కా, కుక్కా ఎందుకు మొరిగావు?
జ: నన్ను యజమాని కట్టిపడేసాడు కాబట్టి
ప్ర: యజమాని, యజమాని కుక్కను ఎందుకు కట్టేసావు?
జ: కట్టేయకపోతే అది కోళ్ళని చంపేస్తోంది. మరి నేను కట్టనా? :))
==
అసలు కధ ఇక్కడ చదవండి.
1 comment:
Hey! Do you know, in Kolkatta, a cow ate chickens...42 of them..
The owner didnot believe it, till he saw one night...
Holy cow...
savineer@yahoo.com
http://in.groups.yahoo.com/group/recwosahyd/messages
Post a Comment