Tuesday, January 23, 2007

రాజీనామ అంటే?

ఒక పార్టీ ఎన్నికలలో ఓడింది. ఆ ఓటమికి బాధ్యత వహిస్తూ మనవాడు రాజీనామ పత్రాలు పంపాడు. రాజీనామ మంజూరయ్యింది. ఇంతవరకూ మామూలు విషయంలాగే ఉంది కదా?

హాస్యాస్పదమేమిటంటే, ఆ ప్రబుద్ధుడు రాజీనామ స్వీకరించబడుతుందని ఊహించక, చేతులు కాల్చుకుని, దిక్కు లేక పత్రికల వాళ్ళ ముందు ఏడుపు మొదలుపెట్టడం. నామమాత్రపు రాజీనామలు, నామమాత్రపు నీతీ నిజాయితీలంటే ఇవే.

ఇక్కడ చదవండి.

మన రాజకీయనాయకులలో నిజాయితీ ఉన్నదంటే ఎలా నమ్మబుద్ధవుతుంది మరి?

3 comments:

వెంకట రమణ said...

గ్రేటాంద్రవాడు వ్రాసేవన్నీ నమ్మదగినవి కావని నా నమ్మకం.

గిరి Giri said...

మీరు చెప్పింది నిజమే. నేను గ్రేటాంధ్రా చూస్తున్నప్పుడల్లా మా ఆవిడ కూడా అదే అంటుంటుంది..

Anonymous said...

అసలు మన రాజకీయనాయకులలో నిజాయితీ ఉన్నదన్నవాడెవడు?