ష్రెక్కు గాడిద కలిసి మొదటి సారి పొట్టి రాజు ఫార్క్వార్డు వద్ద కెళ్ళి నప్పుడు, ఆకాశాన్ని తాకే వాడి రాజభవనాన్ని చూసి ష్రెక్కు “తన దగ్గర ఏదో తక్కవైన దానికి సంజాయిషీలా కట్టాడు కదా” అంటూ వెకిలి నవ్వు నవ్వుతాడు. జాన్మెక్కేను సారా పాలిన్ని ఉపాధ్యక్ష పదవికి ఎన్నుకున్నప్పుడు నా కదే గుర్తుకొచ్చింది.
నెత్తిన పచ్చిక బొత్తిగ నిల్వని
బట్టబుఱ్ఱడి కుండు జుట్టు పిచ్చి
తనవద్ద లేనట్టి తాయిలంబునుజూచి
తారాడు మ్రుచ్చుని దగులు పిచ్చి
సత్తువ లుడిగిన ముత్తాత కొచ్చెనో
పరువంపు వంపుల పడతి గాంచి
సూదంటుఱాయిని కాదంటు త్రోయని
లొంగేటి మ్రుక్కడి లోహమల్లె
లొంగినట్టున్నాడు మెకేను దిగులుతో త
నకెదురు నిలబడ్డ నవకిశోరు
గాంచి యనుభవజ్ఞుడనని గంతులేయు
వాడె చివురు మొలక వలతి నెంచి
Sunday, August 31, 2008
Saturday, August 30, 2008
లంగూడి
ముందు చంద్రమోహన్ గారి జేశ్వరాథముల టపాలో వ్యాఖ్యలు చదవండి. లంగూడి కర్ధమేమిటో చెప్పమ నడిగిన కుర్రాడెవరో తెలియదు, అతనికే నా ఈ పద్యాన్ని అంకిత మిస్తున్నాను. అతడీ పద్యాన్ని చదివి ఏ ప్రశ్న వేస్తాడు?
వృత్తములలోని యతి ప్రాస పెత్తనం బొ
లయిన వాటియం దెన్నగల విధములను
ద్విపద యుత్సాహ యనురెండు వీటి వెనుక
జతగ తరువోజ కందలం జాతులండ్రు
వృత్తములలోని యతి ప్రాస పెత్తనం బొ
లయిన వాటియం దెన్నగల విధములను
ద్విపద యుత్సాహ యనురెండు వీటి వెనుక
జతగ తరువోజ కందలం జాతులండ్రు
Sunday, August 24, 2008
వీరెవరు?
నచ్చిన బ్లాగుల గురించి వ్రాస్తున్నప్పుడు తట్టిన ఆలోచన ఇది. ఓ బ్లాగు గురించో, ఆ బ్లాగులోని ప్రసిధ్థి పొందిన టపా గురించో లేక సదరు బ్లాగరు గురించో ఒకటో రెండో ముక్కలు తెలియజేస్తే - అది ఎవరో పట్టేయగలడం సాధ్యమేనా అని. నేను చెప్పే ముక్కలు నా అనుకోలు కాబట్టి కష్టమవ్వ వచ్చు, కానీ నవ్వులాటకి ఓ పృఛ్ఛకంలా ఆడుకుంటే కాసింత నవ్వు వచ్చు కదా అని, నా ఆలోచనని టపా చేసేసాను. ఇది ఎవరినీ నొప్పించడానికి చేసిన ప్రయత్నం కాదని గమనించి, నేను వ్రాసిన లైన్లు అక్షరాలా నిజం కాకపోవచ్చునని గ్రహించి, వీలు దొరికితే కాస్త బుఱ్ఱగోకి, ప్రయత్నించండి..
బ్లాగులెవరివో చెప్పను, బ్లాగు గురుతు
నొక్క ముక్క వాడుతు వెలిగక్కుతాను,
చూసి చెప్పగలరొ లేరొ చూతు మింక,
నవ్వులాట కాన యెవరు నొవ్వరాదు.
1. తానొవ్వక నొప్పించక (చురకలంటిస్తున్నప్పుడు కూడా :-) OR హుందాతనము
2. బ్లాగక్క
3. పాండిత్యం
4. కేనన్ తో ఫొటోలు
5. "రాక్స్" (రాళ్ళు కావు)
6. పది రూపాయల నోటు
7. సినిమా
8. తెలుగువీరుడు
9. రాముడు మంచి బాలుడు
10. ఆంగ్లము, హాస్యము
11. అనువాద కథలు
12. సాంకేతిక విషయాలు
13. కడప
14. వికిపీడియా
15. కింగ ఫిషర్ విమాన భామలు
16. పనిలేని మంగలి :-)
బ్లాగులెవరివో చెప్పను, బ్లాగు గురుతు
నొక్క ముక్క వాడుతు వెలిగక్కుతాను,
చూసి చెప్పగలరొ లేరొ చూతు మింక,
నవ్వులాట కాన యెవరు నొవ్వరాదు.
1. తానొవ్వక నొప్పించక (చురకలంటిస్తున్నప్పుడు కూడా :-) OR హుందాతనము
2. బ్లాగక్క
3. పాండిత్యం
4. కేనన్ తో ఫొటోలు
5. "రాక్స్" (రాళ్ళు కావు)
6. పది రూపాయల నోటు
7. సినిమా
8. తెలుగువీరుడు
9. రాముడు మంచి బాలుడు
10. ఆంగ్లము, హాస్యము
11. అనువాద కథలు
12. సాంకేతిక విషయాలు
13. కడప
14. వికిపీడియా
15. కింగ ఫిషర్ విమాన భామలు
16. పనిలేని మంగలి :-)
Friday, August 22, 2008
నాకు నచ్చిన బ్లాగులు
తాబాసు గారిది తనదైన గరిమము
కలగూరగంపగా కనులవిందు
కొత్తపాళీగారి గుత్తాధిపత్యము
విన్నదీ కన్నదే వింతలేదు
భైరవభట్లవి బహుచక్క వ్రాతలు
తెలుగు పద్యాలను తెలియపరచు
వర్తమాన విషయ వ్యాఖ్యాత చదువరి
లొసుగులన్ కనిపెట్టి లోతుజెప్పు
వాగ్విలాస రాఘవాభిధానుండును
తెలుగుపద్యములకు తేటగీతి
నాకు నచ్చినట్టి చాకులైదుగురని
సీసపద్యమందు చెప్పబోతి
ఇంకా,
మాండలికమ్ములో కథకు మంజిమ నిచ్చెడి రామనాథుడూ,
మెండుగ హాస్యవల్లరుల మేమెయి పూతకుదెచ్చు శ్రీనివా
సుండును, ఊకదంపుడను చోద్యపు పేరుకి పేరుదెచ్చినా
తండును, నాకునచ్చు మగతా సహ బ్లాగరులైరి చూడగా..
గరిమము= గొప్పదనము
మంజిమ = మనోజ్ఞత
మేమెయి = సునాయాసంగా
కలగూరగంపగా కనులవిందు
కొత్తపాళీగారి గుత్తాధిపత్యము
విన్నదీ కన్నదే వింతలేదు
భైరవభట్లవి బహుచక్క వ్రాతలు
తెలుగు పద్యాలను తెలియపరచు
వర్తమాన విషయ వ్యాఖ్యాత చదువరి
లొసుగులన్ కనిపెట్టి లోతుజెప్పు
వాగ్విలాస రాఘవాభిధానుండును
తెలుగుపద్యములకు తేటగీతి
నాకు నచ్చినట్టి చాకులైదుగురని
సీసపద్యమందు చెప్పబోతి
ఇంకా,
మాండలికమ్ములో కథకు మంజిమ నిచ్చెడి రామనాథుడూ,
మెండుగ హాస్యవల్లరుల మేమెయి పూతకుదెచ్చు శ్రీనివా
సుండును, ఊకదంపుడను చోద్యపు పేరుకి పేరుదెచ్చినా
తండును, నాకునచ్చు మగతా సహ బ్లాగరులైరి చూడగా..
గరిమము= గొప్పదనము
మంజిమ = మనోజ్ఞత
మేమెయి = సునాయాసంగా
Subscribe to:
Posts (Atom)