Sunday, June 01, 2008

బత్తీ బంద్

సీ. పెరటిలో చెట్లన్ని పెకలించి వేసెను
వీటికేమున్నది విలువ యంచు
నూతిలో నీళ్ళన్ని రోత పంకంబుగా

సేసె లేదయ్యొ నా దోస మనుచు
నింటి పైకప్పుకున్ తూటులు పొడిచేను

పైకప్పు కూల దీపాటి కనుచు
జంతుజాలమునెల్ల చంపివేయుచు వీగె

వీటి ప్రాణములు నావేయటంచు

ఘోర పాతకాల కోరి మరల చేసె
తప్పు తనది యనుట, తప్పు యనుచు
నిట్టి మనుజుని కిక నేమని సెప్పుదు
కొంప నరకమంచు ఘొల్లుమనిన?


బత్తి బంద్ లో నేను హాజరు వేయించుకున్న వైనం
ఇక్కడ చదవండి

7 comments:

Anonymous said...

బావుందండీ.
మింటి పైకప్పు?

Bolloju Baba said...

ప్లెయిన్ అండ్ ఫైన్

బొల్లోజు బాబా

రాఘవ said...

ఐనా... మనిషి మారలేదూ... ఆతని కాంక్ష తీరలేదు... హిహ్హిహ్హి :D

@ఊకదంపుడు: మింటిపైకప్పు అంటే ఓజోనేమో (గిరి-కోశం యేమంటుందో చూడాలి) :P

Soujanya said...

బొల్లోజు బాబా గారు, థాంక్స్

ఊదం, రాఘవా,
ఇంటిని పూర్తిగా ధ్వంసంచేసుకొని ఇల్లు ఉండడానికి బాగోలేదని గోడుపెట్టేవాడు నేటి మనిషి అని చెప్పడానికి ప్రయత్నించాను..సీసపద్యం చివర్లో జంతుజాలమునెల్ల బదులు పెంపుడు జంతుల అని వ్రాసి ఉంటే ఇంకా అర్ధవంతంగా ఉండేదేమో..

గిరి

రానారె said...

అది "న్+ ఇంటి" - గమనించినట్టు లేరు ఊకదంపుడు, రాఘవగార్లు. :)

రాఘవ said...

రామనాథా... లోగడ ఇంటిపేరు మింటి ఇపుడు గిరిగారి పుణ్యమా అని (వివాహమై) నింటిగా మారింది :P

గిరి Giri said...

రాఘవా, వివాహమైనందుకేనా మీ బ్లాగులో పద్యాల జోరు తగ్గింది?