Tuesday, November 28, 2006

జాగ్రత్త

చక్కటి కవర్ల లో దొరికే Frozen vegetables ఎంత సుళువో. ఇంట్లో నేను స్వయంపాకం చేసుకోవలసి వచ్చినప్పుడు అవి నన్ను ఎంతగానో ఆదుకునేవి. తరగాల్సిన అవసరం లేకపోవడం ఒక పెద్ద పెట్టు; శుభ్రంగా కనిపించేవి కూడా.
మొన్నీమధ్య ఎంతో దూరం వెళ్ళి కూరగాయలు కొనే ఓపికలేక మేము దగ్గరున్న దేశీ దుకాణంలోనే దీప్ Frozen vegetables కొనేసాము.
తర్వాత ఎప్పుడో (పొద్దుపోక అనుకుంటా) ఎందుకో కవర్ మీదున్న విశేషాలు చదువుతుంటే తెలిసింది - "ఇవి కూడ మామూలు కూరగాయల లాగా కడగాలి" అని. చిక్కుడు కాయలు వేయిద్దామని తీస్తే తెలిసింది అలా ఎందుకు రాసారో. మంచు కట్టిన కొన్ని పురుగులు కూడా ఉన్నాయి వాటిల్లో.
దేశి దుకాణంలో దీప్ కూరగాయలకి ఒక దణ్ణం.