Saturday, December 01, 2007

అమెరికా, ఉంటా మరిక.. - 2

ఇది వరకే చెప్పానుగా, శాము మామకు త్వరలో టాటా చెప్పాలని నిర్ణయించుకున్నామని..

త. అగుదుమే మరి ఒంటివారము, అన్ని బాటలు కొత్తవై
మిగిలియున్నది ఒక్కవారము, వీడుకోలు సశేషమై
మిగుల ప్రీతుల మిత్రులందరి వీడిపోవుట భారమై
దిగులు చెందుట తథ్యమే. పయనించబూనితిమాశతో...

మ.కో. సింగపూరుకు ఐనవారికి చేరువై నివసించ కో
రంగనిర్వురి తల్లిదండ్రులు "రమ్ము దగ్గరనుండగా
బెంగలుండవు బాధలుండవు మీరు వచ్చిన పండగే
రంగుహంగు యుఎస్సునున్నపళంగ కాదని వస్తిరా"

అనడంవల్ల అమెరికాని వీడి సింగపూరుకి ప్రయాణం కడుతున్నాము, వచ్చే వారమే విమానయానం. ఇల్లప్పుడే అమ్మకాలు, షిప్పింగుల కితకితలకి బోసి నవ్వు నవ్వుతోంది.

5 comments:

  1. శుభాకాంక్షలు ..
    తరలము చాలా బాగుంది.. నా ఫేవరేట్ ..
    నేనూ తొందరలో తరలము ప్రయత్నిస్తాను...
    మీరు నాకు మీ e-చిరునామా తెలుపుతూ ఒక మెయిలు వెయ్యగలరా...
    రాకేశ్వర్@జీమేల్.కామ్

    ReplyDelete
  2. మీరు సింగపూర్ కి రిలొకేట్ అవుతున్నారా!! రండి. నేను ఈరోజే బ్లాగడం మొదలు పెట్టాను, పెట్టి పది నిముషాలు కూడా కాలేదు అప్పుడే కాంపిటీషన్ మొదలు. నేను రెండేళ్ళ నించి సింగపూర్ లోనే వుంటున్నాను
    hilaxman at gmail dot com

    ReplyDelete
  3. feel free to contact me if you need any help.

    ReplyDelete
  4. శుభాకాంక్షలు...
    అయినా అమెరికా కీ సింగపూరు కీ అంత తేడా ఉందా ?
    ఇక్కడుంటే ఎక్కువ సార్లు ఇంటికి వెళ్ళచ్చనా ?

    మీకు అంతా మంచి జరగాలని ఆశిస్తున్నాను.

    ReplyDelete
  5. రాకేశ్వరా, ప్రయత్నించండి, తరలము మత్తకోకిల సులభంగానే రాయచ్చు. మీకు వేగు పంపాను.

    లక్ష్మణ్ గారు, తెలుగు బ్లాగ్లోకానికి స్వాగతం. సహాయం చేస్తానని చేయందించినందుకు నెనరులు. ఇప్పుడేమీ లేవు కానీ మున్ముందు ఎవైనా ఉంటే తెలియజేస్తాను.

    ప్రవీణ్, పెద్దతేడా లేదనుకుంటా - నేనింతవరకూ సింగపూరు సందర్శించలేదు. ఇంటికి మాత్రం చాలా దగ్గర కదా? ఏడాదికి అధమపక్షం ఓ రెండుమూడు సార్లైనా హైదరాబాదు విడిదే ఇక..

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.