ఐదవ ప్రశ్నల పుట్టకి సమాధానాలు, ఒక సవరణ ఇవిగో. రెంటికి dosanara, తెలుగువీర, ఒక ప్రశ్నకి చేతన సరైన సమాధానాలు తెలిపారు. నెనర్లు!
1. బాలనటిగా తెలుగు తమిళ హింది రంగాలలో పేరుతెచ్చుకున్నది శ్రీదేవి. ఆమె బావమరిది అనిల్ కపూర్. అతను వంశ వృక్షం అనే తెలుగు చిత్రంలో, పల్లవి అనుపల్లవి అనే కన్నడ చిత్రంలో నటించాడు. పల్లవి-అనుపల్లవి కి దర్శకుడు మణి రత్నం. అతని భార్య సుహాసిని. ఆమె బాబాయ్ కమల్ హసన్. కమల్ హసన్, శ్రీదేవి నటించిన చిత్రం వసంతకోకిల
2. ఎమ్. ఎస్. రామారవు గారు ఘంటసాల గురించి అన్న మాటాలవి., చాకలి వాడు రేలంగి, సినిమా లవకుశ. సవరణ: ఆయన అన్నది “రాముడి పాటలు ఆయనే పాడుకున్నరు, చాకలి వాడి పాటలు ఆయనే, చివరికి వాల్మీకి పాటలు కూడా”
3. బాలిండియా రేడియో అన్నది నాగూర్ బాబు (మనొ)
ఇక ఈ సారి ప్రశ్నలు.
1. కొంచెం కష్టమైనదే: అసెంబ్లి రౌడి, హలో డార్లింగ్, పోలిసు భార్య చిత్రాలకి స్ట్రైసాండ్కి (పరోక్షమైన)సంబంధం లాగ గలరా. (గమనిక: ఆమెకి ఈ చిత్రాల గురుంచి తెలిసే అవకాశం లేదనుకుంటా..సంబంధం కోసం tangential గా ఆలోచించాలి)
క్లూ: "స్ట్రైసాండె ఇఫెక్ట్" గురించి ఆలోచించండి
2. కేంద్ర ప్రభుత్వం తనకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించినప్పుడు 'పద్మ ఉంది కాని శ్రీ లేదు' అని వాపోయిన గొప్ప నటుడు ఎవరు.
క్లూ: తెలుగు నటుడే. ఒకప్పడు కధానాయకుడిగా నటించడానికై కని విని ఎరుగనంత అత్యధిక పారితోషకం లభించేది ఈయనకు..
answer to 2nd questions is Chittoru Nagaiah ..
ReplyDelete౧) ఈ మూడు సినిమాల పేర్ల గురించి గొడవయ్యిందా. అసెంబ్లీ రౌడీ, పోలీసు భార్య ఈ దుమారం వళ్ళ బాగా హిట్టయ్యాయని తెలుసు. హలో డార్లింగ్ గురించి నాకు తెలియదు. పోలీసోడి పెళ్ళాం అని పేరు పెట్టిన సినిమాకి పోలీసు భార్య అని తిరిగి నామకరణం చెయ్యాల్సి వచ్చింది.
ReplyDeleteతెలుగువీర గారు , హలో డార్లింగ్ కు ముందు పెట్టిన పేరు డార్లింగ్ లేచిపోదామా ! నరేష్ , శోభన లతో మౌళి తీసిన సినిమా అది.
ReplyDeleteనాకర్థమై పోయిందోచ్! ఈ సిన్మాలన్నీ "స్ట్రైసాండ్ ఎఫెక్టు" అనగా .. వాటిల్ని అణగదొక్కాలనో, సెన్సారు చెయ్యాలనో చేసిన ప్రయత్నం కాంట్రవర్సీగా మారి హిట్టైనవి.
ReplyDelete