(ముందు వ్రాసిన ఆటవెలదితో కోపం పూర్తిగా వెళ్ళగక్క లేకపోయాను, అందకే పైన ఒక సీసాన్ని జోడించాను)
హైందవ పండితులం దండితుల జేసి,
తరిమికొట్టుట పెద్ద తప్పుకాదు
దేవాలయాలను కైవెక్కి కొవ్వెక్కి,
దాడుల గూల్చిన తప్పులేదు
ఉగ్రవాదమ్ము మతోన్మాద వాదమ్ము,
పెచ్చరిల్లుట కాదు పెద్ద మాట
మతఛాందసుల వల్ల మనతల్లి భారతి,
తల్లడిల్లిన పెద్ద తంతు కాదు
'ప్రతిపక్ష బృందమ్ము బలగమ్ము హెచ్చుట
శాంతి భద్రతలకు చావుదెబ్బ'
సెక్యులరిజమంచు
చెల్లు కబురులు గార్చు
మతపక్షపాత భ్రమణమతులు
ప్రజకు హక్కులంచు,
ప్రగతి పథములంచు
ఎన్నికలను దెచ్చి,
ఎన్నొ కలలు చూపి,
ప్రజల కోర్కె చూచి,
ప్లేటులు ఫిరాయించి
తిక్క మాటలెంచిరేల?
ఉగ్రవాదం పెరగడం కాదు, ఎన్నికలలో మందంజ వేసిన పార్టి వల్ల భయపడాలనేది ఆజాద్ సొల్లు వాగుడు. ఏంటో ఈ గోల?!
Excellent. Very well written. People are realizing the true colors of our so called secular leaders.
ReplyDeletevery well said. For them secularism means opposing BJP, not terrorists.
ReplyDelete"రాజకీయాల్ని కవిత్వాంశాలుగా స్వీకరించాలి" అన్నారు మహాకవి కీ.శే. గరిమెళ్ళ సత్యనారాయణగారు. మీ పద్యం చదివాక ఆయన మాటలు గుర్తొచ్చాయి. బాగా రాశారు. ఈసారి ఒక రాజకీయ అంశాన్ని గుఱించి వ్యాసం బదులు పద్యాల రూపంలో మీరు రాస్తే చదవాలని ఉంది. తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
ReplyDeletemeeru padya prakriyalone vumdamdi chaalaabaagaavraastunnaaru.
ReplyDeleteభలే :-) ఆ ఆజాద్ మాటలు విని నవ్వుకోవాలో వీడి తెలివిలా ఏడ్సిందా అని ఏడ్వాలో తెలియట్లా.
ReplyDelete