సీ. తలకు మించిన పని తలపెట్టి వెరువక
వాదాడు తాబే లొబామ వలన,
గెలుపు నాదేయంచు గీరతో నిక్కిన
కుందేలు క్లింటను కూలబడెను,
తలలు పండిన పండితు లెవరూ కలలోన
సైతము సాధ్యమని, తలపోయ
దలచని మలుపున, తలవంపు లయ్యనే
ముందుండి తగ్గిన ముదిత కిపుడు
చావుదెబ్బ పడెను, చేవ తగ్గదికను,
తగ్గదేమి పొలతి యొగ్గదేమి?
చెప్పనలవి కాదు, పప్పులో పడె కాలు,
తప్పుకోని హిలరి తర్కమేమి?
అయ్యో పాపం అని నాకైతే అనిపించింది హిల్లరీ పరిస్థితి చూసి. ఒబామా గెలిస్తే, మరో 8 ఏళ్ళకి అవకాశం ఓడితేమరో 4 ఏళ్ళకే మళ్ళీ అవకాశం రావచ్చు. ఏది ఏమైనా, షి ఫాట్ లైక్ ఎ లీడర్ టిల్ ద ఎండ్.
ReplyDeleteతాబేలొబామ, కుందేలు క్లింటను -- భలే.
ReplyDeleteవికటకవీ, రాఘవా, నిజానికి నాకు హిలరీ ఓడిపోవడం మహదానందం కలిగించింది.
ReplyDeleteDear telugu blogger,
ReplyDeleteWe are looking for telugu bloggers. Please signup at http://www.enewss.com and submit your telugu blogs
Thanks
sri