సీ. తలకు మించిన పని తలపెట్టి వెరువక
వాదాడు తాబే లొబామ వలన,
గెలుపు నాదేయంచు గీరతో నిక్కిన
కుందేలు క్లింటను కూలబడెను,
తలలు పండిన పండితు లెవరూ కలలోన
సైతము సాధ్యమని, తలపోయ
దలచని మలుపున, తలవంపు లయ్యనే
ముందుండి తగ్గిన ముదిత కిపుడు
చావుదెబ్బ పడెను, చేవ తగ్గదికను,
తగ్గదేమి పొలతి యొగ్గదేమి?
చెప్పనలవి కాదు, పప్పులో పడె కాలు,
తప్పుకోని హిలరి తర్కమేమి?
సీ. పెరటిలో చెట్లన్ని పెకలించి వేసెనువీటికేమున్నది విలువ యంచు
నూతిలో నీళ్ళన్ని రోత పంకంబుగా సేసె లేదయ్యొ నా దోస మనుచు
నింటి పైకప్పుకున్ తూటులు పొడిచేనుపైకప్పు కూల దీపాటి కనుచు
జంతుజాలమునెల్ల చంపివేయుచు వీగె వీటి ప్రాణములు నావేయటంచు
ఘోర పాతకాల కోరి మరల చేసె
తప్పు తనది యనుట, తప్పు యనుచు
నిట్టి మనుజుని కిక నేమని సెప్పుదు
కొంప నరకమంచు ఘొల్లుమనిన?
బత్తి బంద్ లో నేను హాజరు వేయించుకున్న వైనం ఇక్కడ చదవండి