Tuesday, March 04, 2008

No country for old men

శా. నోకంట్రీ ఫరు ఓల్డుమెన్ను కదనంతొక్కింది ఆస్కారుకై,
ఏకంగా మరి నాల్గుబొమ్మలకు కన్నేసింది, ఆస్కారమే
లేకుండా తనసాటి బొమ్మలను తేల్చేసింది ఈ ఏడు చ
క్కా కుందించి పడేసి వాటిని, తనే గైకొంది, వీగింది, పో!


కుందించి అంటే కుదించి, అణగ త్రొక్కి అని అర్ధం వచ్చేలాగ రాస్తే వచ్చిన విమర్శల కారణంగా చివరి పాదం సవరించాను, చివర్లో పురస్కారముల్ అని వాడుక వల్ల పద్యం పూర్తిగా వ్యవహారికము కాక బాగుండదేమో అనే సంకోచం కొంత పీడిస్తున్న మాట మాత్రం నిజం.

శా. నోకంట్రీ ఫరు ఓల్డుమెన్ను కదనంతొక్కింది ఆస్కారుకై,
ఏకంగా మరి నాల్గుబొమ్మలకు కన్నేసింది ఆస్కారమే
లేకుండా తనసాటి బొమ్మలను తేల్చేసింది ఈ ఏటి ప్ర

త్యేకం తానని మెప్పుపొంది, గెలిచిందెన్నో పురస్కారముల్

5 comments:

  1. ఈ సినిమా పేరు శర్దూలంలో చక్కగా ఇమిడిపోవటం భలే ఆశ్చర్యంగా ఉంది.

    కుందించి??

    ReplyDelete
  2. భలే, సినిమా రివ్యూల పద్యాలల్లటంలో మీకు మీరే సాటి.
    నాక్కూడా కొత్తపాళీ గారన్నట్టు "కుందించి" యిక్కడ యివఁడలేదేమోన ననిపిస్తోంది.

    ReplyDelete
  3. giri garu,
    manniMcaMdi.
    నాకు "వీగింది" యివఁడలేదేమోన ననిపిస్తోంది.

    ReplyDelete
  4. ఉ. ఎవ్వరు మెచ్చనట్టిదయె నెందులకో నని మార్చివేసితిన్
    (ముందూ వెనకా మీ ఇష్ఠం, మీరే పూరించుకోండి)

    ReplyDelete
  5. వహ్వా వహ్వా...బాగుంది..

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.