Tuesday, February 19, 2008

మైక్రోసాఫ్టు పన్నాగం

ఇది చదవండి

త. చదువుసంధ్యల మున్గితేలుతు సాఫ్టువేరులు వాడగా
(బదులు డబ్బులు లాగుదామని మడ్డియోచన మానితే)
వదివి వేసిన వారలందరు వాడుకొందురు తేరగా,
ముదిరిపోదురు వాటిలోబడి, మంచి రాబడి వారిచే
కుదిరిపోవును ముందుముందిక, కొక్కెమే ఇది భేషుగా

4 comments:

  1. మ్మ్మ్.... వాడి స్వార్ధముంటే ఉంది లెండి. కుర్రాళ్ళకీ ఉపయోగమేగా. ఈ పైరేటెడ్ సాఫ్టువేరు సంపాదించే బాధలు తప్పుతాయి.

    మనలోమాట, నేను బిల్ల్ గేట్స్ అభిమానినండోయ్ :-)

    ReplyDelete
  2. ఫ్రీ గా ఇస్తే పన్నాగమందువు
    డబ్బులడిగితే దర్జాగా పైరసీ సేతువు
    గప్పుచుప్పుగా విండోసే వాడుదువు
    పదుగురిలో దానినే పరాచికాలాడెదవు
    తప్పటడుగులు తగవయా యాద’గిరి’ !

    ReplyDelete
  3. వికటకవి గారు, విద్యార్ధులకి ఇది తప్పక ఉపయోగపడుతుంది. కానీ గమనించారా,వారి చిట్టాలో చైనా భారతదేశాలు లేవు - మనదగ్గర ప్రవేశ పెడితే ఏమవుతుందో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు కదా..

    అనామకం గారు, మీరన్నది నిజమే, కానీ నేను విండోస్ ని పరాచికాలాడలేదండి. మా ఇంటి కంప్యూటరులో, కలనయంత్రంలోనూ విండోసు, లినక్సు రెండూ ఉన్నా నేనూ వాడేది విండోసే..

    ReplyDelete
  4. అలా బిల్లు మాఁవ ఊరకే ఇచ్చిన సాఫ్టువేరుతో నేను నా పదవీపూర్వ చదువు వెలగబెట్టాను, కాబట్టి మీ పద్యాన్ని నేను స్వల్పం నుండి ఒక మోస్తరు వఱకూ ఖండిస్తున్నాను :)

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.