Tuesday, October 02, 2007

అలవోక సినీ పృఛ్ఛకం (Random cine quiz) - 4

మూడవ పృఛ్ఛకంలో సౌమ్య అన్నిటికీ, విశ్వనాధ్ కొన్నిటికి సరైన సమాధానాలు చెప్పారు. అదే ప్రశ్న తరహాలో ఇంకోటి.

క, ఖ, గ ముగ్గురూ హింది చిత్రరంగంలో పేరుపొందిన సంగీతదర్శకులు. క, ఖ సమకాలీకులు కూడా. గ ని చిన్నప్పుడు రికార్డింగ్ స్టూడియోకి తీసుకు వెళ్ళే అలవాటు క కి ఉండేది. ఒక సందర్భంలో గొంతెత్తి ఏడుస్తున్న గ ని చూసిన ఖ - "ఏడుపు కూడా స్వరబధ్ధంగానే ఏడుస్తున్నావే" అని అబ్బురపడి ఒక స్వరంపేరు ముద్దు పేరుగా పెట్టాడు. గ పెరిగి పెద్దైన తర్వాత కూడా చాలా మంది ఆ పేరు (చ) తోనే పిలిచేవారు.

క, ఖ, గ ఎవరు? చ ఏమిటి?

(ఒక క్లూ: గ సంగీతం కూర్చడంలోనే కాక, తబల, హార్మొనిక (మౌతార్గన్) వాయించడంలో దిట్ట)

5 comments:

  1. అయ్యా....సినీ ప్రశ్నలనగానే ఆసక్తిగా తెరవడం, ప్రతి సారీ హిందీకి సంబంధించిన ప్రశ్న ఉండటంతో నిరాశ చెందటం జరుగుతోంది. తెలుగు చిత్ర్రాలకు సంబంధించి ప్రశ్నలేసే కార్యక్రమం ఉందా లేదా....

    ReplyDelete
  2. ఉంది. ఐదవ టపాలో తప్పక చేస్తాను..

    ReplyDelete
  3. క - ఎస్.డి. బర్మన్
    ఖ - ఆర్.డి. బర్మన్
    చ - పంచం / పంచం దా
    కాని ఈ ఖ ఎవరు?

    ReplyDelete
  4. అవును! తెలుగైతే నేనూ పాల్గొంటాను

    ReplyDelete
  5. చేతన,
    మీ సమాధానలు సరైనవి. ఖ 'నౌషాద్'. ఆర్.డి. బర్మన్ కి పంచం అనే పేరు రావడం వెనక ఇంకొక కధ కూడ ఉంది. చిన్నప్పుడు ఎప్పుడు 'పా', 'పా' అంటుంటే చూసిన అశోక్ కుమార్ 'పంచం' అని పేరు పెట్టాడని కూడా అంటారు.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.