Thursday, October 11, 2007

Dashiel Hammett's Red Harvest

ఉ. పిల్వగ పేరులేదునొక పిస్టలు చేగొని టౌనుకొచ్చెతా
నిల్వగ బెట్టగా నచటి నీతియు నీయతి కల్లమొక్కటే
సిల్వరు గుండుగా* తలచి సంధిగయున్న ముఠాల చెర్పగా

సిల్వరు గుండుగా* తలచి చిచ్చురగల్చ ముఠాల మధ్యనన్
కాల్వల నెత్తురుల్ పడెను కాల్చుకొనంగ ముఠాల్ పరస్పరం


సిల్వరు గుండు : Silver bullet is one that instantly solves a long-standing problem.

ఇదండి డాషియల్ హామెట్ రాసిన 'రెడ్ హార్వెస్ట్' పుస్తక కథా సంక్షిప్తం. ఎందరొ సమీక్షకులు దీని కథను యొజింబొ కథకు పోల్చి నప్పటికీ, కొరొసావా ఎన్నడు రెడ్ హార్వెస్ట్ ని ప్రేరణగా ప్రకటించలేదు. డాషియల్ హామెట్ రాసిన ద గ్లాస్ కీ అనే పుస్తకం (అ తర్వాత చిత్రం) మీద మాత్రం యొజింబొ ఆధారపడిందని ఒప్పుకున్నాడట. ఇంకా నేను ద గ్లాస్ కీ చదవలేదు. వచ్చే టపాలో రెడ్ హార్వెస్ట్ మరియి యొజింబొల మధ్య ఉన్న సామ్యం గురించి రాస్తాను.

7 comments:

  1. ఇది ఇంకా చాలా బాగుంది. మొదటి పాదం చాలా సహజంగా వచ్చింది. సిలవరు గుండు పాదం కూడా. చివరి పాదంలో మొదటి గణం తప్పింది చూడండి. అలాగే మూడో పాదం చివర "చెర్పగా" అన్న మాట కూడా నప్పలేదు. అక్కణ్ణించి నాలుగో పాదం మొదలు వరకూ మారిస్తే బాగుంటుంది. "వెస్టర్న్" మీద బహుశా మొదటి తెలుగు పద్యమేమో ఇది. క్రెడిట్ కార్డులూ, క్లింటన్లూ, స్టేట్యూ ఆఫ్ లిబర్టీల మీద పద్యాలు చెప్పిన మన అవధానులు కూడా ఎవరూ వెస్టర్న్ ల గురించి పద్యం చెప్పినట్టు లేరు.

    ReplyDelete
  2. కొత్త పాళీ గారు,
    ముందు ఉత్పలమాల రాసి దాన్ని చంపకమాల చేయడం వల్ల చివరి పాదంలో గణం తప్పింది, చూసుకోలేదు. సవరించాను. ఇప్పుడెలా ఉందో చూడండి. 'చెర్పగా' కి బదులు ఇంకేం వాడవచ్చో ఆలోచిస్తాను. విలువైన వ్యాఖ్య రాసినందుకు నెనరులు..

    ReplyDelete
  3. ఓహో, పాదం మొదట్లోని నలాన్ని, భ గణాన్ని అర్థవంతంగా మారిస్తే ఉత్పలమాల, చంపకమాలలను పరస్పరం మార్చొచ్చన్నమాట. బాగుంది, మీ చమత్కారం!

    ReplyDelete
  4. నిజమే, మీరడిగినట్లు యీ పద్యంలోని మూడవపాదంలో యతిమైత్రి కుదరలేదు. నాకు తెలుసున్నంతమటుక్కు, వ్యంజనయతి విషయంలో స్వరయతి ప్రధానమైనది. కాబట్టి, అచ్చులవిషయంలో యతి కుదరకపోతే గనుక దానిని దోషంగానే పరిగణించాలి.

    ReplyDelete
  5. ఏమండోయ్ చదువరిగారూ, యిది కేవలం ఉత్పల-చంపకమాలలకే కాదండీ, శార్దూల-మత్తేభాలకీ, మత్తకోకిల-తరలాలకీ కూడా వర్తిస్తుంది.

    ReplyDelete
  6. రాఘవ గారు, విశదీకరించినందుకు నెనరులు..మూడవ పాదము సవరించాను. మిగతా పద్యాలని కూడా భుతద్దం కింద పెట్టల్సిన అవసరము ఉందనుకుంటా..

    ReplyDelete
  7. దీనిపై యిక సవరణలనవసరమని మదభిప్రాయం. పద్యం చక్కగా,నిండుగా వుందిప్పుడు.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.