Sunday, August 26, 2007

హాపీ డేస్ పాటలు - తొలి impressions

మొత్తం ఏడు పాటలు ఉన్నాయి హాపీ డేస్ లో - అన్నీ మంచి ప్రాచుర్యం పొందే విధంగానే కూర్చాడు కొత్త సంగీత దర్శకుడు మిక్కి. టైటిల్ పాట హాపీ డేస్ రాక్స్ మరియు జిల్ జిల్ జిగా అనే ఇంకో పాట ఒకే బాణీలో ఉండి - బీట్లు క్వీన్ పాట "వీ విల్ రాక్యూ" ని గుర్తు తెచ్చేవిగా, బాణీ మణిరత్నం చిత్రం యువ లో "ధక్కా లగా బుక్కా" పాటని గుర్తు తెచ్చేవిగా ఉన్నాయి. మిగతా పాటలన్నీ వినడానికి సొంపుగానే ఉన్నాయి. ఆనందదాయకమైన విషయం మాత్రం, ఇంత వరకూ శేఖర్ చిత్రం అనగానే పాడిందే పాటరా పాచి పళ్ళ దాసరా? అనిపించే తీరులో ఉండే కే.ఎం.రాధాకృష్ణన్ పాటలనుండి మనకి విముక్తి లభించడం.

1 comment:

  1. పాటలు చాలా బాగున్నయండి.ఇప్పుడే విన్నా.మిక్కి కొత్త వాడు కాదు.10త్ క్లాస్,నోట్ బుక్ సినిమాలకి సంగీతం ఇచ్చారు.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.